Wednesday, September 14, 2011

రాధా రాధా మదిలోన మన్మధ బాధ



రాధా రాధా మదిలోన మన్మధ బాధ
రాత్రి పగలు రగిలించెయ్ మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు
నేనాడితే నువ్వాగవు

ఈ పాట తెలుగు వారికి దుపరిచయమయిన స్టేట్ రౌడీ అనే చిత్ర కళాఖండంలోనిది. నాకెప్పుడూ అనిపిస్తుంది పురాతన కాలం నుంచి అప్పటికి ఎప్పటికి రాధని అందరూ ఒక 'మన్మధబాధా సంబంధిత కవితా వస్తువుగా చూసారు గాని ఒక మంచి మనసున్న మనిషిగా చూడలేదనిపిస్తుంది. నిజానికి రాధ ఒక దేవతా స్రీ, ఒక అవతారం, కారణ జన్మురాలు. కానీ, చాలామంది కవులకి ఒక కల్పనా పూర్విత శృంగార కవితావస్తువు. ఉత్తర భారతదేశంలో రాధా కృష్ణులకి గుడులున్నాయి, కానీ, దక్షిన భారతంలో అవి తక్కువ. అందువల్లనేమో ఈ మన్మధబాధ దక్షిన భారతంలోనే ఎక్కువనుకుంటా.

బ్రహ్మలోకం పైన వైకుంఠం, రుద్రలోకం; దానిపైన సుదర్శన చక్రం, ఆపైన గోలోకం ఉంటాయిట. ఆ లోకమే రాధాకృష్ణుల శాశ్వత నివాస స్థలం. అక్కడివే గోకులం, బృందావనం, మాధుర మండలం. ఆ గోలోకంలో రాధాకృష్ణులు ఆది దంపతులు. శ్రీకృష్ణుడు భువికి రావడంవల్ల భూమిలోకూడా మధుర, బృందావనం, గోకులం ఏర్పడ్డాయి. అక్కడ పీతాంబర ధరుడై, నెమలి పింఛం తలపై ధరించి వేణువు చేతపట్టి, రెండు భుజాలతో అలరారుతుంటాడు మేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు. నిరాకారుడైన పరమాత్మే ఆ రూపంలో అక్కడ విరాజిల్లుతున్నాడు. ఆయన పక్కన విలసిల్లే హ్లాదినీ శక్తి రాధ. లక్ష్మి, దుర్గ, లలిత, శ్యామల మొదలైన మహాశక్తులందరూ ఆ రాధ అంశలు.

మునిజనమానస మోహిని యోగిని బృందావనం.
మురళీరవల్లకక ఆడిన నాగిన బృందావనం.
రాదా మాధవ గాధల రంజిలు బృందావనం.
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం.

అలాంటి గోలోకంలో రాధాకృష్ణులు ఆది దంపతులు. ఆ రాధాకృష్ణులిద్దరికీ ఒకటే ఆసనం, ఒకటే బుద్ధి, ఒకే మనస్సు, ఒకే జ్ఞానం, ఒకే ఆత్మ. వారిరువురు ఒకే పరబ్రహ్మ. భారతదేశంలో ఏ నదికైనా, అవి పురాణాల్లో ఏదో ఒక లోకం నుంచే వచ్చాయని కవులు చెప్పారు. యమున గూడా అలాగే ఈ గోలొకం నుంచి వచ్చి వుంటుందేమో?

దేవీ భాగవతం ప్రకారం గోకులంలోని రాధ పాదపద్మ దర్శనం బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభం. శ్రీదాముడు శ్రీకృష్ణుని గోలోక భక్తుడు. ఒక కారణంవల్ల రాధ, శ్రీదాముడు పరస్పరం శపించుకున్నారు. శ్రీదాముడు శంఖ చూడుడనే అసురునిగా జన్మించాడు. పాపఫలం అనుభవించాడు. రాధ కూడా భూలోకంలో పుట్టి శ్రీకృష్ణ వియోగం అనుభవించింది. రాధ నందవ్రజంలో వృషభానుడు, కళావతి అనే వైశ్యదంపతులకు కుమార్తెగా అవతరించింది. రాధ కృష్ణుని కంటే పదమూడేళ్ళ పెద్దదిట. ఆమె శ్రీకృష్ణుని పెంపుడుతండ్రియైన నందునికి చెల్లెలనీ, ఆ విధంగా కృష్ణునికి మేనత్త అనీ కొందరు అంటారు. ఈ రాధ పాత్ర వేదవ్యాసులవారి "సంస్కృత భాగవతం" లో కానీ, పోతనామాత్యులవారి "ఆంధ్ర మహా భాగవతం" లో కానీ లేనేలేదు!

రాధ సంసిద్ధౌ అనే ధాతువు నుండి రాధ అనే పదం పుట్టిందిట. ఒకవృత్తం గీసి ఆంగ్లభాషలో ఎ అనే అక్షరాని ముందు చేర్చి చదివితే ఆరాధ్‌ అనే పదం తయారవుతుంది. ఆరాధ్‌ అంటే ఆరాధన, సాధన, పొందుట, సంతోషించుట, పూజించుట అని అర్థాలు వస్తాయి. పూజ అనే సాధనను సంతోషంగా ఆచరించి సిద్ధిని పొందటాన్నే ఆరాధన అంటారని తాత్పర్యార్థంగా చెప్పవచ్చు. రాధా అన్న పదంలో దాగి ఉన్న ఆరాధ్‌ అనే పదం సగుణ ఉపాసనను, ప్రేమభక్తిని చెబుతుంది. రామతత్త్వంలో మరా అనే అక్షరాలు రామగా మారినట్టు, కృష్ణతత్త్వంలో ధారా అనే పదాలు రాధగా మారాయి.

రాధ పాత్రకు అజరామరమైన (అప?)ఖ్యాతిని ఆర్జించి పెట్టినవాడు జయదేవ కవీంద్రుడు. ఆయన తన సంస్కృతకావ్యం "గీతగోవిందం" లో రాధాకృష్ణుల ప్రణయాన్నే ఇతివృత్తంగా స్వీకరించాడు. జయదేవుని అష్టపదులు చాలా శ్రావ్యంగా, మధురాతిమధురంగా ఉంటాయి. "హరిరిహ ముగ్ధవధూ నికరే, సావిరహే తవ దీనా రాధా, ప్రియే! చారుశీలే!, ధీర సమీరే, యమునాతీరే" ఇత్యాదులన్నీ ఆ మహాకవి లేఖిని నుండి జాలువారిన అష్టపదులే! రాధాకృష్ణుల ఆరాధన దక్షిణభారతదేశంలో కన్నా, ఉత్తరభారతంలో ఎక్కువ.

మహా భారతంలోను, రాధమ్మ ప్రణయం గురించి కవుల మనస్సులు వివిధ కల్పనలు చేసాయి. రాధ ఎప్పుడూ కృష్ణుని కొసం ఎదురు చూస్తుంది కానీ, ఎవరూ కూడా, ఎప్పుడూ కృష్ణుడు రాధ కొసం ఎదురు చూసినట్లు వ్రాయలేదు. అంటే రాధా మాధవులది వన్ సైడ్ లవ్వా?

గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. చాలామంది మగానుభావులు మేనత్తని ప్రేమించటమేమిటి ఠాట్! అది తప్పు అని అంటే, మరి మేనమామని పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మేనత్తని ప్రేమిస్తే తప్పేమిటి, వంకాయ్?

చాలామంది కవులు ఎవడి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు రాధపై కపిత్వం వ్రాసుకున్నారు. ఎవడబ్బ సొమ్మని? రాధ ఇప్పుడు ఉంటే సూ చేసి ఉండేది. నేనే లాయర్ ని అయితే, ఫ్రీగా వాదించేవాడిని. అన్ని పుస్తకాలకి రయల్టీ నొక్కేవాడిని. కొన్నిటిని బాన్ చేసేవాడిని కూడా. అసలు జయదేవుడి శృంగార లీలలు అనే ఒక పుస్తకం వ్రాసి స్టేట్ రౌడీ లాంటి కళాఖండం పాటలతో ఒక సాంఘిక పౌరాణిక చిత్రరాజం తీసే వాడిని. సరయిన ప్రొడ్యూసర్ దొరక్క తీయలేకపొయాను.

రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం కూడా.

కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. రాధది స్వచమైన మనసు. కృష్ణ్నుడు అందరినీ ప్రేమిస్తాడని తెలిసి కూడా నిజాయితీగా ప్రేమిస్తుంది. రాధ గురించి అలోచించినప్పుడు నాకు ఆర్చీ కామిక్స్ లో బెట్టీ గుర్తుకు వస్తుంది. ;)

నాకు రాధంటే ఇష్టం. రాధకి మాత్రం కృష్ణుడంటే ప్రేమ. ఇంకేం పీకుతాను? ఆర్య సినీమాలొ హీరో లాగా. కాని కృష్ణుడెంత మాయగాడు. రాధ ఒక్కతికే కాక ఒక 16,000 మందికి ప్రేమ సమానంగా పంచి ఇస్తాడు. మనకంత సీను లేదు. పైగా కృష్ణుడు దేవుడు కూడా, లేదంటే గొడవలయిపోవూ? హెహె ఉత్తినే!

9 comments:

  1. హహ...పాపం రాధ...(యమునా తటిలో పాట స్టైల్ లో :))
    ఆయ్...మా కిట్టిని మాయగాడు అంటారా :P

    ReplyDelete
  2. చాలా చక్కగా చెప్పారు! మాటలు రావడం లేదు మీరు వ్రాసిన దాని మీద వ్యాఖ్యానించడానికి అంత అద్భుతంగా ఉంది!

    ReplyDelete
  3. Wow! this is awesome

    rādhe jaya jaya mādhava-dayite
    gokula-taruṇī-maṇḍala-mahite

    dāmodara-rati-vardhana-veśe
    hari-niṣkuṭa-vṛndā-vipineśe




    vṛṣabhānūdadhi-nava-śaśi-lekhe
    lalitā-sakhi guṇa-ramita-viśākhe

    karuṇāḿ kuru mayi karuṇā-bharite
    sanaka-sanātana-varṇita-carite

    ఒక్కోసారి శ్రీమతి రాధారాణి మీద మన తెలుగు రచయితల మీద తెలుగు బ్లాగర్ల మీద తెగ కోపం వస్తూ ఉంటుంది
    మెర్సీ కి మారుపేరు అయిన దేవతని కీర్తిస్తే మనఃశాంతి దొరుకుతుంది వితందవాడులుతో కేలుక్కుంటే మిగిలేది అసాంటే అని లైట్ తీసేసుకున్నాను పైగా టైం ఒకటి లేదాయే గొడవలు పెట్టుకోడానికి

    >>మహా భారతంలోను, రాధమ్మ ప్రణయం గురించి కవుల మనస్సులు వివిధ కల్పనలు చేసాయి. రాధ ఎప్పుడూ కృష్ణుని కొసం ఎదురు చూస్తుంది కానీ, ఎవరూ కూడా, ఎప్పుడూ కృష్ణుడు రాధ కొసం ఎదురు చూసినట్లు వ్రాయలేదు.

    ఎవరు ఎవరు వ్రాయలేదు
    శ్రీ రూపా గోస్వామి రాసారు కదా


    purport గుర్తులేదు అడిగి అందచేస్తాను

    ReplyDelete
  4. కిరణ్ గారు, ధన్యవాదాలు. కిట్టిగాడు నిజంగా మాయగాడే ;)
    రసజ్ఞ గారు, ధన్యవాదాలు. మీ అంత బాగా రీసెర్చి చేసి వ్రాయలేను లెండి. ;)
    హరే కృష్ణ గారు, ధన్యవాదాలు. రూపా గోస్వామి వ్రాసారా? తప్పక వెతికి చదవాల్సినదే.

    ReplyDelete
  5. రాధ అనే పేరు నాకూ బాగా ఇష్టం. అప్పట్లో అనూరాధ అనే అమ్మాయిని బాగా అభిమానించేవాడిని. అనూరాధ అంటే అర్ధం ఏంటండీ?

    ReplyDelete
  6. dari cherara krishna dari cherara krishna anni anni vandala savatsrala nundi paaduthoonuunnara .anduke lets change the beat yaa patarap patarap

    ReplyDelete
  7. రాధ మాత్రం కృష్ణుడి లాంటి రొమాంటిక్ హీరో ని కాకపోతే ఇంకెవర్ని ప్రేమిస్తుంది సార్ ..కానీ ఈ అంశం మీద రాసిన ఈ వ్యాసం అమోఘం మాస్టారు ..

    ReplyDelete
  8. బాగుంది ..బాగుంది..మరిన్ని విషయాలు చెప్పండి..

    ReplyDelete