Sunday, August 21, 2011

చాతకం జిందాబాద్!

చాతక పక్షి  (ఆంగ్లం jacobian cuckoo) కోకిల జాతికి చెందిన ఒక పక్షి. ఈ పక్షి, మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది.

అప్పటి వరకూ వేరే నీరు ముట్టదు. దీక్షకు, వేచి ఉండే ఓర్పుకు ఉదాహరణగా ఈ పక్షిని ఉదహరిస్తూ ఉంటారు.

చాతకం మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉంటుంది. తెలుగు సినిమా రిలీజు అయ్యిన మొదటి రొజు మొదటి ఆట మాత్రమే చూడాలనుకుంటుంది.

చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. విస్కీ గూడా నీళ్ళు కలపకుండా ఆన్ రాక్స్ తాగుతుంది.

కాళిదాసు మేఘసందెశంలొ చాతకం గురించి ఏమన్నాడంటే,

మన్దం మన్దం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతక స్తే సగన్ధః
గర్భాధానక్షణపరిచయా న్నూన మాబద్ధమాలాః
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః

దీని అర్ధం

"అనగననగనగా ఒకప్పుడు ఒకానొక చాతక పక్షి పూర్వీకుడు ఎక్కడపడితే అక్కడ నీళ్ళు తాగేవాడు. అజీర్తి చెస్తే కడుపు నొప్పి వచ్చి వుంటుంది. దెబ్బకి దయ్యం వదిలి మంచి నీరు మాత్రమె తాగాలని ఒక బొడి నియమం వేసి వుంటాడు, అప్పటినుంచి తర తరాలుగా అన్ని చాతకాలు అలా అలా తొలి వర్షపు చినుకు నీళ్ళు మాత్రమే తాగేవి, ఏది పడితే అది తాగితే అజీర్తి చేస్తుందనే భయం వలన."

అందువల్ల చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. ఎప్పుడూ ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది.

ఏమిటి, అలా అనుమానంగా చూస్తున్నారు? సరే, మరొక కాళిదాసు పద్యం వదులుతున్నా. 

అమ్భోబిన్దు గ్రహణచతురాం శ్చాతకాన్‌ వీక్షమాణాః
శ్రేణీభూతాః పరిగణనయా నిర్దిశన్తో బలాకాః
త్వా మాసాద్య స్తనితసమయే మానయిష్యన్తి సిద్ధాః
సోత్కన్ఠాని ప్రియసహచరీ సంభ్రమాలిఙ్గితాని

దీని అర్ధం ఏమిటంటే

"నిజంగా ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే ఇంతకంటె అదను లేదు. సాహసీ! నీ సందేశం కోసం విశ్వం తన చాతక వదనం తెరుచుకున్నది. నీ గానానికి మా వీణా తంత్రుల శ్రుతి సవరిస్తున్నాము. తలుపులన్నీ వివృతం చేసి ఉంటాము. నువ్వు రావాలి. రావా లి.... నువ్వు ఎప్పుడు వస్తావో! ఎలాగ వస్తావో! నువ్వు సైక్లోన్ లాగో, సల్ఫూరిక్ ఆసిడ్ లాగో గంధ సింధూరం లాగో గండ భేరుండం లాగో రావోయ్! రావోయ్! యువకవీ!! నవకవీ!!''

ఏమిటి, మళ్ళీ అలా అనుమానంగా చూస్తున్నారు?
ఇదేమిటి, కాళిదాసు ఇంగ్లీషు లొ రాసాడేమిటనుకుంటున్నారా, అబ్బే, చెప్పానుగా, కాళిదాసు, శ్రీశ్రీ గారు ఎమీ అనుకొరని.   హిహి

ఇప్పుడో చిన్న పిట్ట కధ.

"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి.
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది.
ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.
ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది."

ఈ కధ లొ నీతి ఏమనుకుంటున్నారు?
.
.
.
.
.
ఆ రెండు పక్షుల్లొ ఒకటి ఆడది, ఒకటి మగది, అందువల్ల లవర్ చచ్చిపొతే రెందవదికూడ చనిపోయిందని రొమాంటిక్ గా అలొచించారా? పప్పులో కాలు వేసారు.
.
.
ఆ బాణం వేసింది రజనీకాంత్. ఒక్క బాణం వేస్తే వంద బాణాలు వేసినట్లే. అందుకే రెండూ చచ్చిపొయాయి. 

అసలు మయాబజార్ సినిమాలొ ఘటొత్కచుడి కిరీటం పైన ఈకలు ఎవరివనుకున్నారు?మన చాతకం పక్షి ఈకలే మరి. అసలు ఘటొత్కచున్ని కిరీటం పైన ఈకలు లెకుండా ఊహించుకొండి, అబ్బే, లేకపొతే మయాబజార్ హిట్టు అయి వుండేదే కాదు.      

చాతకం జిందాబాద్!


7 comments:

  1. ఘటోత్కచుని ఈకలు చాతక పక్షివో కాదో నాకయితే తెలియదు! మీరు నిజమే చెప్పారనుకుంటున్నా!!! కానీ బాగుందండి బాగా రాసారు సంస్కృతములో మేఘదూతం లోని పద్యాలతో బాగుంది మీ టపా. సైన్సు పరముగా చూస్తే మాత్రం ఈ పక్షులు గొంగళీ పురుగుల్ని ఎక్కువగా తింటాయి కదా! మీ చాతక పిట్ట కధలు బాగున్నాయి.

    ReplyDelete
  2. రసజ్ఞ గారు, ధన్యవాదాలు.
    ఘటోత్కచుని ఈకలు చాతక పక్షివి కావండి. ఏదో అలా వ్రాసానన్నమాట. చాతకపక్షి కోయల జాతికి చెందినది కదా. ఎలా అయితే కోయల తన గుడ్లు వేరే పక్షి గూట్లో పెడుతుందో, అలాగే ఇక్కడ కూడా అలా ఎక్కడో లేపుకోచ్చిన విషయాలు చెప్పానన్న మాట. :) ఆ కాళిదాసు పద్యాలకి తాత్పర్యం తెలియదండీ. నేను వ్రాసినది అంతా హులుక్కి ;) రెండవ పద్యం యొక్క తాత్పర్యం మాత్రం ఒక సంబంధం లేని శ్రీశ్రీ భావావేశం. మొత్తం టపా లో ఒక్క అజీర్తి విషయం ఒక్కటే నా సొంతం.;)

    ReplyDelete
  3. ha ha ha .. good intro.
    ఇంక అదరగొట్టండి.

    ReplyDelete
  4. కాళిదాసు కవిత్వం కొంత మీ పై(ము)త్యం కొంత అన్నమాట...
    ఆరంభం అదిరింది మాష్టారు.

    పోతే, కామెంట్లకు వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి మాష్టారు, పానకంలో పుడకలాగా అడ్డొచ్చేస్తుంటాయి అవి.

    ReplyDelete
  5. కొత్తపాళీ గారికి, నాగార్జున గారికి,
    ధన్యవాదములు.

    ReplyDelete
  6. బాబోయ్ చాతకం గారు మీరు కేకండి :)
    ఎటు నుండి ఎటు వెళ్ళిపోయారు :D ....నిజమే అసలు మాయాబజార్ ఇప్పటికి చూస్తున్నాం అంటే ఆ ఈకల వల్లే :P
    soooper ..!! :)

    ReplyDelete
  7. చాతకం జిందాబాద్!

    ReplyDelete